Telugu News Power

ఏఎస్ఎన్ఎం కళాశాలలో యోగా తరగతులు ప్రారంభం

పాలకొల్లు: జూన్, 12 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఉన్నత విద్యాశాఖ కమిషనరేట్ వారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ ఏడాది యోగాంధ్ర, 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ప 21)సందర్భంగా పక్షం రోజుల యోగా సంసిద్ధత కార్యక్రమాలను కళాశాల ప్రిన్సిపల్ డా. కె. రత్న మాణిక్యం అధ్యక్షతన శుక్రవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ శాఖ, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–I, II సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా. కె. రత్న మాణిక్యం యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణకు యోగా అవసరమన్నారు.
వైస్ ప్రిన్సిపల్ టి కృష్ణ యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ మైలాబత్తుల రామకృష్ణ,డాక్టర్ వి. డి వి విజయలక్ష్మి యోగా దినోత్సవం నేపథ్యంలో నిర్వహించబోయే వివిధ కార్యక్రమాల గురించి తెలియజేసి, విద్యార్థులు ప్రతిరోజూ యోగా సాధనలో పాల్గొనాలని సూచించారు. ఫిజికల్ డైరెక్టర్ పి దుర్గారావు, అధ్యాపకులు, విద్యార్థులచే యోగాసనాలు, కవాతులు, మెడిటేషన్ చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ బి. కనక లక్ష్మి ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్సిసి వాలంటీర్లు పాల్గొన్నారు.