Telugu News Power

ఓటర్ల జాబితా తణిఖీలో పార్టీ శ్రేణులది కీలక పాత్ర. -మంత్రి నిమ్మల.

పాలకొల్లు; జూన్, 6 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఓటర్ల జాబితా తణీఖీలో పార్టీ శ్రేణులది కీలక పాత్రని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పోడూరు, యలమంచిలి క్లస్టర్ ల పరిధిలో మంత్రి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 15 నుంచి, వచ్చే నెల 14 వరకు ఓటర్ల జాబితా తనిఖీ కార్యక్రమం అధికారులు చేపడతారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 75 శాతం, స్థానిక నియోజకవర్గంలో 60 శాతం ఓటర్ల జాబితా పరిశీలన పూర్తియిందని తెలిపారు. ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉండేలా, శ్రద్ధ పెట్టి శ్రేణులు పనిచేయాలని సూచించారు. ఓటరు పేరు జత పరచటానికి, ప్రభుత్వం నిర్దేశించిన 12 రకాల గుర్తింపు పత్రాలలో, ఏదో ఒకటి ఉంటే సరిపోతుందని
వివరించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితా అధికారులు సరి చూస్తారని వెల్లడించారు. గత ఓటర్ల జాబితాలో ఉన్న పేరుకు, జతపరిచి చూస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాలను రెండు కళ్ళగా చూస్తూ, ప్రగతి వైపు దూసుపోతుందన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, మంత్రి శ్రేణులకు భరోసా ఇచ్చారు. ప్రతి ఓటు విలువైనది అయినందున, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో, పెనుమత్స రామభద్రరాజు, జి సూర్యనారాయణ రాజు, దాసరి రత్నం రాజు, రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.