Telugu News Power

ఓటర్ల సవరణలో బి ఎల్ ఓ లు అప్రమత్తతో ఉండాలి. -ఆర్డీవో దాసిరాజు ఆదేశాలు.

పాలకొల్లు,: జూన్,11(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల విస్తృత తనిఖీ కార్యక్రమంలో బిఎల్ఓ లు అప్రమత్తతో ఉండాలని నరసాపురం ఆర్డీవో, ఎన్నికల అధికారి దాసిరాజు, బూత్ లెవెల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశ మందిరంలో, గురువారం జరిగిన బి ఎల్ ఓ లు, పార్టీల బూత్ కమిటీ సభ్యులకు జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆర్డిఓ పలు సూచనలు చేశారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో జనన ధ్రువపత్రం తప్పనిసరిగా తనిఖీ చేయాలని, ఆ తరువాత మాత్రమే ఓటు నమోదు చేయాలని వివరించారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఏ ఒక్క ఓటు తొలగించడానికి అధికారం ఎవరికి లేదన్నారు. ఓటర్ల విస్తృత తనిఖీ కార్యక్రమంలో విధులకు ఎవరైనా అడ్డంకులు కల్పిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీవో హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక అధికారి వీరబ్రహ్మం, శిక్షణ అధికారులు, బి ఎల్ వో లు, పార్టీల బూత్ కమిటీ కన్వీనర్లు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.