ఉండి: జూన్, 11 (తెలుగు న్యూస్ పవర్. కామ్)ఉండి నియోజకవర్గం కొండేపూడి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ కార్యకర్త రామారావుకు ఇచ్చిన మాట ప్రకారం స్థానిక ఎంపీ, కేంద్రమంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ నూతన గృహాన్ని తన సొంత ఖర్చుతో నిర్మిస్తున్నాము. ఆ ఇంటి స్లాబ్ పనుల్లో గురువారం స్వయంగా పాల్గొని కార్యకర్తలతో కలిసి ‘శ్రమదానం’ చేసారు. ఈ సందర్భంగా, కేంద్రమంత్రి ఆనందాన్ని, సంతృప్తిని వ్యక్తం చేశారు.ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడుతున్న ఏ కార్యకర్త శ్రమా వృధా పోదన్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ తన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా, లబ్ధిదారుని కుటుంబం, 15 లక్షల రూపాయలతో ఇంటిని నిర్మించి ఇస్తున్న కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పలువురు స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.