పాలకొల్లు: అక్టోబర్, 17
( తెలుగు న్యూస్ పవర్. కామ్)
శ్రీ కృష్ణదేవరాయ సాంస్కృతిక విజ్ఞాన కేంద్రం- వ్యస్థాపక అధ్యక్షులు యర్రంశెట్టివెంకటరత్నం ఆధ్వర్యంలో, స్థానిక
గాంధీ బొమ్మల సెంటర్ లో వున్న శ్రీ కృష్ణ దేవరాయలు విగ్రహం వద్ద శనివారం రాయలు 497 వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు.
సంస్థ గౌరవ అధ్యక్షులు, యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ (యూ.కే.ఐ. ఎస్.సీ) గవర్నర్ పెనుమాక రామ్మోహన్ మాట్లాడుతూ,
దక్షిణ భారత ప్రజల అభిమాన పాత్రుడు, అష్టదిగ్గజాలను తన కొలువులో నిలుపుకొన్న కవిసార్వభౌముడు, ముస్లీం సామ్రాజ్య వాదులను దక్షిణ భారతంలో అడుగిడు నివ్వని, ఓటమి ఎరుగని యోధుడు, విజయనగర సామ్రాజ్యాధీసుడు
శ్రీకృష్ణదేవరాయలు
మరణశాసనం
కర్ణాటక రాష్ట్రం తుముకూరుజిల్లా
హొన్నెన హళ్లి గ్రామం లో ఉన్న గోపాలకృష్ణ దేవాలయం వద్ద కన్నడ శాసనం ఆధారంగా 17-10-1529 తేదీ నాడు రాయల వర్ధంతి వేడుకలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామనితెలియజేసారు.
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచానికి ఎలుగెత్తి చాటిచెప్పిన శ్రీ కృష్ణ దేవరాయలుకు
పూలమాలతో నివాళులు అర్పించడం తో సరిపెట్టక, వివిధ సేవా కార్యక్రమాల తో పాటు
రాయల స్మరణ మన తెలుగు భాషపై ప్రేమను, సాహిత్యం పై ఆసక్తిని, సంస్కృతి పై గౌరవాన్ని, సమాజం పట్ల బాధ్యతను కలిగిస్తున్న ఈ సాంస్కృతిక విజ్ఞాన కేంద్రం లక్ష్యాలకు తోడుగా
నిలుస్తామని ముఖ్య అతిధులు గా విచ్చేసిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు వంగా నరసింహారావు,
కలిదిండి వెంకట పతి వర్మ, సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు జి ఎస్ ఎన్ మూర్తి, రాయలు కీర్తి ని కొనియాడారు.
సంస్థ ఉపాధ్యక్షులు కానూరి ప్రభాకర్ వందన సమర్పణ చేశారు.
ఈ కార్యక్రమం లో
సంస్థ కార్యదర్శి పశ్యావుల రవికుమార్, కోశాధికారి జక్కంపూడి మదన్,డా. చవాకుల నరేష్ బాబు, శిరిగినీడి రాంబాబు,
మండెల పణినాథ్, బోనం మునసబు,చేగొండి ప్రభాకర్, ఇనుకొండ శేషాద్రి, రాయి సూరిబాబు, మండెల రజనీ, చెరుకూరి శ్రీనివాస్, కర్రా నరసింహారావు, కొండ్రేడ్డి సూరిబాబు, మద్దాల ముత్తాజీ రావు, ఉనికెల శ్రీనివాసరావు, గుండుమోగుల వీరాస్వామి, గంధం యేసుపాదం, రావి సిద్ధార్థ, తాళాబత్తుల వెంకటేశ్వర రావు,తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.