
పట్టణంలో రూ 16 కోట్లతో 15 పార్కులు. క్రీడ కోర్టుల నిర్మాణం. ఎన్నికల కోడ్ తర్వాత పనులు.
-మంత్రి నిమ్మల
పాలకొల్లు: అక్టోబర్, 18
(తెలుగు న్యూస్ పవర్. కామ్)
కాస్మోకల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాత, చెరుకూరి బుద్దావతారం రాజు తనపై పుత్రవాత్సల్యం చూపించే వారిని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు గుర్తు చేసుకున్నారు. స్థానిక కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సౌజన్యంతో ఐష్టా, అప్ స్ట ప ఆధ్వర్యంలో జరుగుతున్న ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ సందర్భంగా, కాస్మో కాంప్లెక్స్ వేదికపై ఆదివారం రాత్రి జరిగిన సభలో మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సభకు కాస్మో కాంప్లెక్స్ అధ్యక్షులు, టెన్నిస్ టోమెంట్ చైర్మన్, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి, బుద్దావతారం రాజు తో తనకున్న అనుబంధం గురించి వివరిస్తూ, బిడ్డ ప్రయోజకుడుగా ఎదిగితే సంతోషించే వారు తల్లిదండ్రులని, రాజు తనను మానస పుత్రుడుగా, తను ప్రగతిని చూసి ఆనందించే వారిని పేర్కొన్నారు. వారి కాళ్లకు నమస్కరించేంత గౌరవనీయమైన, మంచి వ్యక్తిని వెల్లడించారు. వీరు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్థాపించి, నేటికీ, ఏనాటికి రాష్ట్రవ్యాప్తంగా, విద్య వైద్యం, ప్రకృతి విపత్తులు, పుష్కరాల వంటి భారీ కార్యక్రమాల్లో, కాస్మో కాంప్లెక్స్ భాగస్వామ్యం గణనీయమైనదన్నారు. కాలంతో పాటు కనుమరుగైన వ్యక్తులపై ద్విగుణీకృతమైన అభిమానాన్ని సంపాదించుకునే మహనీయులు ఒకరిగా బుద్దావతారం రాజు చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచిపోతారన్నారు. ప్రస్తుత అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, సేవే లక్ష్యంగా, క్రీడలను ప్రోత్సహిస్తూ, యువతను క్రీడలు వైపు మళ్ళించే ప్రయత్నం అభినందనీయం అన్నారు. ఆరోగ్యవంతమైన శరీరంలోనే, శక్తివంతమైన మానసిక ఆరోగ్యం ఉంటుందని, ప్రతి ఒక్కరికి వ్యాయామం అవసరమని పేర్కొన్నారు. ఇందుకోసం పట్టణంలో రూ. 16 కోట్లతో 15 పార్కులు నిర్మిస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ప్రతి రెండు వార్డులకు ఒక పార్కు, మహిళలకు వాకింగ్ ట్రాక్, క్రీడా కోర్టులు, పూలవనాలు ఉంటాయన్నారు. టెన్నిస్ కు సంబంధించి 35 పైన వారికి టెన్నిస్ కోర్టు నిర్మాణం, గాంధీ భగవాన్ రాజుతో కలిసి చర్చించి, నిర్మాణానికి కృషి చేస్తామని సభికుల అర్షద్వానాల మధ్య ప్రకటించారు. క్షత్రియుల సేవా భావం, క్రమశిక్షణ తనను ఎంతగానో ప్రభావితం చేస్తాయని వెల్లడించారు. వారిపై తనకు ఎంతగానో గౌరవ అభిమానాలు ఉన్నాయన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని ఏడాది పాటు నిర్వహించి, యువతకు స్ఫూర్తిగా వారి కాంస్య విగ్రహాన్ని పాలకొల్లు నడిబొడ్డులో ఏర్పాటు చేశామన్నారు. పట్టణానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన సి వి రాజు పై ఉన్న అభిమానంతో, వారి కుమారులు మధు, మున్ని విజ్ఞప్తి మేరకు పట్టణంలోనే పురాతనమైన 27 వార్డు పార్కుకు రూ 50 లక్షలు, ప్రస్తుతం మరో రూ. 70 లక్షలు కేటాయించినట్టు వెల్లడించారు. తన అభిమానాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లో చూపడానికి ప్రయత్నం చేస్తున్నానన్నారు. పాఠశాల స్థాయి నుంచి తనకు సహచరుడిగా ఉన్న గాంధీ భగవాన్ రాజు పిలుపుమేరకు, పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ, సమయం కేటాయించుకుని ఈ కార్యక్రమానికి హాజరైనట్టు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి లీటర్ పై ఉన్నప్పటికీ, ప్రధాని మోడీ ఆశీస్సులతో, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పట్టణానికి ఇప్పటికే రూ.1170 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పట్టణాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా, అగ్రగామిగా నిలపాలని నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. పట్టణంలో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతుందన్నారు. సభకు హాజరైన క్షత్రియ ప్రముఖుల్లో ఒక్కొక్కరు ఒక లక్ష మందిని ప్రభావితం చేయగల సమర్థులు ఉన్నారని, వీరు పార్టీలకు అతీతంగా స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా, మంత్రి టెన్నిస్ ఆడి, టోర్నమెంట్ను లాంఛనంగా ప్రారంభించారు. టోర్నమెంట్ చైర్మన్ గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ, బుద్దావతారం రాజుకు టెన్నిస్ క్రీడపై ఉన్న ప్రేమ అభిమానాలను వివరించారు. దేశం వ్యాప్తంగా టెన్నిస్ క్రీడాభివృద్ధికి కృషి చేసిన ప్రముఖుల్లో బుద్దావతారం రాజు ఒకరన్నారు. కాస్మో కాంప్లెక్స్ వ్యవస్థాపకులైన, బుద్దావతారం రాజు స్ఫూర్తిని, ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళడానికి కృషి చేస్తున్నామన్నారు. వారి కుమారులు, వర్మ మెరైన్స్ అధినేత, వర్మ ప్రతి ఏటా రూ. 5 లక్షలు ఇచ్చి ఈ క్రీడా పోటీలను ప్రోత్సహిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. కాస్మో కాంప్లెక్స్, విద్య, వైద్యం, పకృతి విపత్తులు, పుష్కరాలు వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా సేవలు అందిస్తూ, వాటిని మరింత విస్తృతంగా అందజేయడానికి కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. కాస్మో కాంప్లెక్స్ కు అన్ని విధాలుగా అండదండల అందిస్తున్న మంత్రి నిమ్మలకు భగవాన్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. టెన్నిస్ పోటీల నిర్వహణకు కార్యదర్శి, రాంబాబు, డి.ఎస్.ఎన్ రాజు, రామకృష్ణు లు దేశవ్యాప్తంగా నిర్వహించటానికి శ్రమిస్తున్నారని అభినందించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా క్రీడా సంబరాలు నిర్వహించటం ఆనందంగా ఉందన్నారు. ఈ క్రీడోత్సవాలు అంగరంగ వైభవంగా జరగటానికి శ్రమిస్తున్న తమ బృందాన్ని అభినందించారు. క్షత్రియ పరిషత్ అధ్యక్షులు, సూరిబాబు మాట్లాడుతూ, టెన్నిస్ ఉన్నంతకాలం బుద్దావతారం రాజు చిరంజీవి గా ఉంటారన్నారు. ఈ సభలో మల్లికార్జున రావు, మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా, కాస్మో కాంప్లెక్స్ ఆతిథ్యం కొత్తల్లుడిని చూసినట్టుగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, రూ. 50 వేలు విరాళంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి, కాశ్మీర్ కాంప్లెక్స్ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాసరాజు, పి వి ఎస్ ఎన్ రాజు, ముఖ్యపాట్రన్ సిహెచ్ వెంకటేశ్వర్ వర్మ, టోర్నమెంట్ డైరెక్టర్, వివి సోమరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గొట్టుముక్కల శ్రీ వెంకటరామ సూర్యనారాయణ రాజు(,బూన్ రాజు) సత్తిరాజు, డాక్టర్ కే.ఎస్.పి, ఎన్ వర్మ, గండేటి వెంకటేశ్వరరావు, మా ఊరి వెంకట అప్పారావు, పరుగులు క్రీడాకారులు క్రీడాభిమానులు పాల్గొన్నారు.

