Skip to main content

Telugu News Power

మంత్రి నిమ్మల రామానాయుడుకు, రెల్లి సంఘం కృతజ్ఞతలు.

మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్న రెల్లి సంఘం సభ్యులు

పాలకొల్లు: అక్టోబర్, 17 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడుకు స్థానిక రెల్లి సంఘం తరఫున శనివారం, మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు. రెల్లి సామాజిక వర్గానికి అవసరమైన సామాజిక భవనాన్ని నిర్మించడానికి మంత్రి రూ.కోటి నిధులు మంజూరు చేయించారు. ఈ సామాజిక భవనం వల్ల తమ సంఘీయులు వివిధ కార్యక్రమాలు చేసుకోవటానికి ఎంతకాలం ఉపయోగపడుతుందన్నారు. తమ చిరకాల వాంఛ తీర్చినందుకు మంత్రిని ఆత్మీయంగా కలుసుకొని, తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ భవనాన్ని, అన్ని వసతులతో, సుందరంగా, సౌకర్యవంతంగా తీర్చి దిద్దుతానని మంత్రి తెలిపారు. అవసరమైతే మరో కోటి రూపాయలు కూడా భవనానికి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ రెల్లి యువజన సంఘం ఆధ్వర్యంలో పలువురు మహిళలతో సహా విశేషంగా మంత్రి క్యాంప్ కార్యాలయానికి తరలి వెళ్లారు.