Skip to main content

Telugu News Power

ఘనంగా గణపతి నవరాత్రులు ప్రారంభం. వాడ వాడలా, వీధి వీధి నా వెలసిన విఘ్ననాధుని మందిరాలు. ధూమ్ ధామ్ గా, 62 అడుగుల మహా మట్టి గణపతిని ఆవిష్కరించిన మంత్రి నిమ్మల.

స్థానిక మనీ మార్కెట్ స్వర్ణ గణనాథుని వద్ద మంత్రి నిమ్మల
పాలకొల్లు రెల్లి వీధి లో వెలసిన 62 అడుగుల మహాగణపతి మట్టి విగ్రహం

పాలకొల్లు: సెప్టెంబర్,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) గణపతి నవరాత్రుల సందర్భంగా, వాడ వాడలా,వీధి వీధినా, మూడు అడుగుల నుంచి 60 అడుగుల వరకు ఉన్న గణేష్ మండపాలు వెలిశాయి. పళ్ళు పూలతో మందిరాలు అలంకరించారు. దీపాలంకరణ ఈ పందిళ్ళ మరింత శోభ చేకూర్చింది.స్థానిక రెల్లి పేటలో వెలసిన 62 అడుగుల మహా గణపతిcమట్టి విగ్రహం పాలకొల్లు కేక పరిసర ప్రాంతాల వాసులను విశేషంగా ఆకట్టుకుంది. ధూమ్ ధామ్ గా జరిగిన ఈ విగ్రహావిష్కరణ, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు చేతులు మీదుగా సోమవారం జరిగింది. ఈ సందర్భంగా, ప్రజలకు మంత్రి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. గత 36 ఏళ్లుగా, భక్తిశ్రద్ధలతో, వినాయక చవితి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న రెల్లి వీధి వినాయక వినాయక సంఘం కమిటీ వారిని, శిల్పి ఇంటి ప్రసాద్, పెయింటర్ రాజు, వందమంది యువకులకు నాయకత్వం వహించి రెండు వారాలపాటు శ్రమించిన అప్పారావు మధు తదితరులను మంత్రి నిమ్మల అభినందించారు. రాష్ట్రం పాడి పంటలతో,సుభిక్షంగా, ఉండాలని ప్రార్థించారు. పాలకొల్లు నుంచి పూలపల్లి వరకు మంత్రి వివిధ మండపాలను వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సందర్శించారు. ఈ పర్యటనలో మంత్రి వెంట రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి ఉన్నమట్ల కపర్తి, రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు, మాజీ కౌన్సిలర్ ధనానీ సూర్య ప్రకాశ్ పాల్గొన్నారు. వై సి పి పాలకొల్లు నియోజకవర్గం ఇంచార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి, వైసిపి కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు గుణ్ణం నాగబాబు, పట్టణ అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ చందక సత్తిబాబు గణేష్ మండపాలను సందర్శించారు. జనసేన పార్టీ జిల్లా నాయకులు, ఎడ్ల బజారు కనకదుర్గమ్మ ఆలయ చైర్మన్ తులా రామలింగేశ్వర రావు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నాయక మండపాలను జనసేన పార్టీ సభ్యులతో కలిసి సందర్శించారు.

మహాగణపతి విగ్రహం వద్ద మంత్రి నిమ్మల
మహాగణపతి విగ్రహం వద్ద మంత్రి నిమ్మల

 

రెల్లి వీధి మహాగణపతి విగ్రహం వద్ద వైసీపీ నాయకులకు ఘన స్వాగతం