Skip to main content

Telugu News Power

జలవనరుల శాఖ మాత్యుల నియోజకవర్గంలో నీటి కొరత. -వైసీపీ ఇన్చార్జ్ గోపి ఆరోపణ

ఎండిపోయిన నారుముళ్ళు చూపుతున్న రైతులు

యలమంచిలి: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) సాక్షాత్తు రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు గారి నియోజకవర్గంలోనే రైతులు సాగునీటి కొరత వల్ల అల్లాడుతున్నారని వైసీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల శ్రీహరి గోపాల్ రావు గోపి ఆరోపించారు. ఈ సందర్భంగా మేడపాడుకు చెందిన రైతులు ఎండిన నారు ముళ్ళు గోపి కి చూపించారు. నెరవేసిన ఆకు ముందు నీరు లేక పాడైపోతున్నాయని రైతులు వాపోయారు. ఎండిన నారుమలలో వైసీపీ జెండాలు కట్టిన సైకిల్ పై గోపి సవారీ చేసి నిరసన తెలిపారు. రైతులను కూటమి ప్రభుత్వం దగా చేసిందని, సాగునీటి కొరత వల్ల క్రాప్ హాలిడే ప్రకటించి వారికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాల్సిందని సూచించారు. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు నోరుమూడి దశలోనే 5 వేల రూపాయలు నష్టపోయారని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో, పార్టీ మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు, వినుకొండ రవికుమార్, గుర్రాల వెంకట్రావు పాలంకి శ్రీనివాసరావు, ఓదూరి భాస్కరరావు తదితరులు, రైతులు పాల్గొన్నారు.