Skip to main content

Telugu News Power

దస్తావేజు లేఖర్ల పక్షాన విపక్షాల మద్దతు.

వైసీపీ నాయకులకు వినతి పత్రం అందజేస్తున్న దస్తావేజులేఖర్లు

పాలకొల్లు: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) గత ఐదు రోజులుగా పెన్డౌన్ నిరసన కార్యక్రమం చేస్తున్న దస్తావేజులాఖరులకు విపక్షాల రంగప్రవేశంతో మద్దతు లభించింది. స్థానిక నిరసన శిబిరాన్ని వైసీపీ రాష్ట్ర నాయకులు చెల్లెమ్ ఆనంద ప్రకాష్, జడ్పిటిసి నడపను గోవిందరాజులు నాయుడు శుక్రవారం సందర్శించారు. దస్తగిరి లేఖలు జీవో నెంబర్ 396 ఉపసంహరణ, డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వారికి అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు అవసరమైతే పార్టీ తరపున కార్యక్రమం చేపడతామని హామీ ఇచ్చారు. సిఐటియు నాయకులు జార్జ్, యర్రా అజయ్ కుమార్ తదితరులు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగాధ్యక్షులు వెంకటేశ్వరరావు కార్యదర్శి శ్రీనివాస్ తదితర లేఖర్లు, డిటీపి ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు పాల్గొన్నారు.