యలమంచిలి: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నార్ని మెరక శివారు గమళ్ళపెంటకు చెందిన జై భీమ్ యువసేన ఫౌండేషన్, యలమంచిలి లంకకు చెందిన చెవ్వేటి ప్రణీతకు రూ. 48 వేల రూపాయల సహాయం గురువారం అందజేశారు. ఈమెకు తల్లి లేదు. తండ్రి దివ్యాంగుడు. ప్రణీత ప్రస్తుతం బిఎస్సి నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతున్నది. విషయం తెలుసుకు జై భీమ్ యువసేన ఫౌండేషన్ వారు ఫీజుల నిమిత్తమై అవసరమైన పూర్తి మొత్తం ఫౌండేషన్ ద్వారా అందజేశారు. పేద విద్యార్థిని ఆదుకున్నందుకు పలువురు ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలిపారు, సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో, గౌరవ అధ్యక్షులు రాయపూడి భవాని ప్రసాద్, తరపట్ల మదన్ మోహన్ రావు, డాక్టర్ విష్ణు బాలాజీ, రవిచంద్ర, సుమలత, స్వప్న, రవిచంద్ర, సురేష్ బాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
జై భీమ్ యువసేన రూ. 48 వేలు సాయం.
ప్రణీతకు ఆర్థిక సాయం అందజేస్తున్న జై భీమ్ యువసేన ఫౌండేషన్ సభ్యులు