పాలకొల్లు: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్)
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల్లో పాలకొల్లు ఛాంబర్స్ జూనియర్ కాలేజి విద్యార్థులు విశేష ఫలితాలను సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కారుమూరి బాబ్జీ గురువారంతెలిపారు.
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం లో ఎంపిసి విభాగంలో అడబాల భవ్య తేజశ్రీ 1000 మార్కులకు గాను 987 మార్కులను, బైపిసి విభాగంలో బాలం తేజస్విని 987 మార్కులు సాధించి పాలకొల్లు టౌన్ లో రెండవ స్థానంలో నిలిచింది. ఎంఇసి విభాగంలో రెడ్డి యర్రంనాయుడు 964 మార్కులు సాధించి పాలకొల్లు పట్టణ స్థాయిలో మొదటి స్థానాన్ని ,రాష్ట్రస్థాయిలో మూడవ స్థానాన్ని సాధించాడు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో కళాశాల చైర్మన్ కె. వి. ఆర్. నరసింహారావు మాట్లాడుతూ,తమ కళాశాల లో అతి తక్కువ ఫీజులకే నాణ్యమైన విద్యను అందించడమే కాక ప్రతి సంవత్సరం పదవ తరగతి లో 540 కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారికి ఫీజులో పూర్తి రాయితీ, 510 నుండి 539 మార్కుల వరకు సాధించిన వారికి సగం ఫీజు రాయితీ కల్పిస్తూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇంటర్మీడియట్ లో కూడా మొదటి సంవత్సరం ఫలితాలలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు కూడా ఇదే విధంగా రాయితీలు కల్పిస్తున్నామన్నారు.కళాశాల అడిషనల్ చైర్మన్ తటవర్తి కృష్ణమూర్తి తమ కళాశాల లో విద్యతో పాటుగా విద్యార్థుల సంపూర్ణ వికాసానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కళాశాల సెక్రటరీ,కరస్పాండెంట్ కనుమూరి సీతారామరాజు అత్యుత్తమ ప్రతిభను కనబరచిన విద్యార్థులను అభినందిస్తూ బహుమతులు అందజేసి, దుశ్శాలువాలతో సత్కరించారు. అత్యుత్తమ మార్కులను సాధించిన విద్యార్థులు మా విజయానికి మా కృషితో పాటు మా కళాశాల అధ్యాపకుల బోధన మరియు మేనేజ్మెంట్ వారి సహకారం ఎంతగానో ఉపయోగపడిందని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ట్రెజరర్ రేపాక ప్రవీణ్ భాను, అకడమిక్ అడ్వైజర్లు డా. ఎబిఎస్ మూర్తి,నందుల సీతారామారావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. వేంకటేశ్వరరావులు విద్యార్థినీ విద్యార్థులను ప్రశంసించారు. కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.