పాలకొల్లు: జులై, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల వద్ద దస్తావేజులేఖర్లు నిర్వహిస్తున్న పెన్ డౌన్ నిరసన కార్యక్రమం గురువారం ముగింపు దశకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన రిజిస్ట్రార్ కార్యాలయాల కార్యకలాపాలకు ప్రైవేటు వ్యక్తులకు ప్రవేశం కల్పిస్తూ చేసిన జీవో నెంబర్ 396ను తక్షణం పెసరట్టుగా ఉపసంహరించుకోవాలని నిరసన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాలకు వివిధ సంఘాల, పార్టీల ప్రముఖ నాయకులు స్వయంగా వచ్చి పలువురు వీరికి మద్దతు తెలుపుతున్నారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు ముద్దాడ గణేష్, కార్మిక విభాగం అధ్యక్షులు శిడగం రవిశేఖర్ వారి బృందం శిబిరాన్ని సందర్శించి, దస్తావేజు లేకలకు అనుకూల నినాదాలు చేసి మద్దతు తెలిపారు. వారికి లేఖరుల సంఘం అధ్యక్షులు తాళ్లూరు వెంకటేశ్వరరావు, కృత్తివెంటి రవికాంత్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు దస్తావేజు లేఖలు స్టాంపు వెండర్ లు డిటిపి ఆపరేటర్లు నిరసన కొనసాగించారు.
దస్తావేజు లేఖర్ల కు బీసీ నాయకుల మద్దతు.
దస్తావేజు లేఖర్ల కు మద్దతు తెలుపుతున్న బీసీ సంఘం నాయకులు.