Skip to main content

Telugu News Power

దొడ్డిపట్లలో మెగా పేరెంట్స్ సభ

మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల
విద్యార్థులతో సహఫంక్తి భోజనం చేస్తున్న మంత్రి నిమ్మల

యలమంచిలి: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర వ్యాప్ ్యాప్తంగా శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ డే ఉత్సవం, ఆత్మీయ కలయిక కార్యక్రమంలో, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జ ల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
దొడ్డిపట్ల ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్.సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఈ సభ లో ముఖ్యఅతిథి, నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర విద్యా శాఖ మాత్యులు నారా లోకేష్ విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకు వచ్చారని తెలిపారు. విద్యార్హంగ అభివృద్ధికి, పాఠశాలలకు, విద్యార్థులకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు అవుతున్నట్టు పేర్కొన్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల కు తల్లికి వందనం కార్యక్రమంలో ప్రతి విద్యార్థికి వారి తల్లిదండ్రుల ఖాతాలోకి నేరుగా రూ.13 వేలు గత రెండేళ్లగా కూటమి ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు. మంత్రి నిమ్మల విద్యార్థులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతులతో ముచ్చటించారు.
ఈ కార్యక్రమానికి మండల స్పెషల్ ఆఫీసర్ గిడుగు వెంకటరమణ, మాజీ జెడ్పిటిసి బోనం నాని,తెలుగుదేశం పార్టీ నాయకులు, సర్పంచ్, చేగొండి రవిశంకర్, మామిడి శెట్టి పెద్దిరాజు, జనసేన నాయకులు, సొసైటీ అధ్యక్షులు, డేగల సత్తి కొండ బిజెపి నాయకులు తోలేటి చంటి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కామాడి ఏడుకొండలు, మండల విద్యాశాఖ అధికారి, జి వీరస్వామి, పంచాయతీ సెక్రెటరీ, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, పాఠశాల శ్రేయోభిలాషులు హాజరయ్యారు.