Telugu News Power

పెదపేట రామాలయానికి ఆకివీడు నగరపాలక సంస్థ ఆమోదముద్ర.

ఆకివీడు: ఏప్రిల్ ,21 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పెదపేట లో రామాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో భాగంగా నూతన ఆలయ నిర్మాణానికి సంబంధించి మంగళవారం తొలి అడుగు పడింది. స్థానిక నగర పంచాయతీ వారు ఆలయ నిర్మాణానికి అవసరమైన తీర్మానం ఆమోదించారు. నగర పంచాయతీ కార్యాలయంలో మంగళవారం జరిగిన అత్యవసర సమావేశంలో తీర్మానం ఆమోదించారు. కౌన్సిల్ సభ్యులు 20 మందిలో 19 మంది తీర్మానాన్ని ఆమోదించారు. కౌన్సిలర్ జోష్న ఒక్కరే ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. కౌన్సిల్లో 13 మంది వైసిపి పార్టీకి చెందినవారు ఉన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి, స్థానిక ఎమ్మెల్యే కొనుమూరి రామకృష్ణంరాజు పాల్గొన్నారు. రామాలయం కమిటీ కార్యదర్శి జుడ్డు దుర్గాప్రసాద్ దేవాలయ నిర్మాణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు సమర్పించారు.