Telugu News Power

నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి, లేదు విశ్రాంతి. -మంత్రి నిమ్మల.

భగేశ్వరం శంకుస్థాపన సభలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల.

పాలకొల్లు: జూన్, 7 (తెలుగు న్యూస్ పవర్. కామ్) నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిక్షణం పాటుపడుతున్నానని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో రూ. 2.35 కోట్లతో ప్రారంభించనున్న రోడ్లు,మురుగు కాలువల పనులకు ఆదివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా, భగేశ్వరంలో ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడారు. ఎన్నికల్లో వచ్చి పోయే బాటసారి ని కాదని, నిరంతరం ప్రజల్లో మమేకమై ఉంటున్నానని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం నుంచి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్నప్పటికీ, కోట్లాది రూపాయల అభివృద్ధి పనుల కోసం శ్రమిస్తున్నానన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేశామన్నారు. ఐదేళ్లపాటు విధ్వంస పాలనతో, రాష్ట్ర అభివృద్ధిని కకావికలం చేసి వెళ్లిపోయిన, జగన్ మళ్ళీ అధికార దాహంతో, ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారని, పొరపాటున మరో అవకాశం ఇస్తే రాష్ట్రానికి భవిష్యత్తు అంతా శూన్యమేనని ఆందోళన వ్యక్తం చేశారు. తన పాలనా కాలంలో ఒక్క డీఎస్సీ పోస్ట్ కూడా వేయకుండా, ఉద్యోగాలు చేసుకుంటున్న ఉపాధ్యాయులను అవమానించే విధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగాలపై రాజకీయ కుట్ర చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేసే కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఎల్లవేళలా అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. టిడిపి మండల అధ్యక్షులు పాముల రజిని కుమార్, బిజెపి నాయకులు ఉన్న మట్ల కపర్తి, లోకేష్, కలిదిండి రామచంద్ర రాజు, సుబ్బారావు, పెనుమత్స శ్రీనివాసరాజు, విజయకుమార్, బాబాయ్, కోటి వీరభద్రరావు, లింగయ్య, పెచ్చెట్టి నాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, మహిళలు మంత్రికి అపూర్వ స్వాగతం పలికారు.