Skip to main content

Telugu News Power

నేడు ఎమ్మెల్సీ గోపి మూర్తి పర్యటన.

భీమవరం: జూలై,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి, మరోసారి ఆ పదవికి పోటీ చేస్తున్న సందర్భంగా, ఉపాధ్యాయుల మద్దతు కోరుతూ జిల్లాలో పర్యటన కొనసాగిస్తున్నారు. వీరు ఆదివారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిగూడెం జడ్పీ హైస్కూల్ వద్ద
తణుకు తాడేపల్లిగూడెం క్లస్టర్లు వారిని కలుస్తారు.
మధ్యాహ్నం 1 గం. కు భీమవరం యుటిఎఫ్ జిల్లా కార్యాలయం
భీమవరం, ఉండి క్లస్టర్ల వారిని కలుసుకుంటారు.
మధ్యాహ్నం 3 గంటలకు పాలకొల్లు మున్సిపల్ హై స్కూల్లో పాలకొల్లు, మార్టేరు, నరసాపురం క్లస్టర్ల వారితో సమావేశం అవుతారు.

జిల్లా ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర కౌన్సిలర్లు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు, జిల్లా కుటుంబ సంక్షేమ సంఘం డైరెక్టర్లు, మండల /పట్టణ శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆఫీస్ బేరర్లు, రిటైర్డ్ /సీనియర్ బాధ్యులు, ప్రజాసంఘాల బాధ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ సమావేశాలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కేఎస్ఎస్ ప్రసాద్ హాజరవుతారు. ఈ సమావేశాలకు ఎమ్మెల్సీ ఓటర్ల వివరాలు, విశ్లేషణ, పట్టణ/మండల కన్సాలిడేషన్ పట్టికలతో హాజరు కావాలని కోరారు.