Skip to main content

Telugu News Power

రైతుల పక్షపాతి, రైతు బిడ్డ నిమ్మలపై వైసీపీ దుష్ప్రచారాన్ని రైతులు నమ్మరు.

పత్రికా సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి అధ్యక్షులు మామిడి శెట్టి పెద్దిరాజు తదితరులు

యలమంచిలి: జూలై, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు సొంత నియోజకవర్గంలో రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, వైసిపి పార్టీ ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాల్ రావు, గోపి ఆ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలను స్థానిక తెలుగుదేశం నాయకులు, నీటి సంఘాల అధ్యక్షులు శనివారం తీవ్రంగా తిప్పికొట్టారు . రైతు బిడ్డ, రైతు పక్షపాతి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రైతులకు ఎక్కడ కష్టం వస్తే, అక్కడ వెంటనే సమస్య పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తారని వారు పేర్కొన్నారు. వైసీపీ పార్టీ నాయకులు పాలకొల్లు నియోజకవర్గం అంతా తిరిగితే ఎక్కడ నీటి సమస్య లేకపోవడంతో ఎలమంచిలి మండలం మేడపాడు లో మెరక చేను ఎంచుకుని గోరంతలు చేసి మంత్రిపై అభాండాలు వేయటం తగుతున్నారు. రాష్ట్ర మొత్తం మీద ఎక్కడ ఎంత నీరు ఉందో, ఎవరికి ఎంత అవసరమో లెక్కలు చెప్పగల సమర్థత ఉన్న మంత్రి నిమ్మలని తెలిపారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల కొంత నీటి ఎద్దడి మాట వాస్తవమేనని, అలవాటు కూడా లేకుండా మంత్రి కృషి చేస్తున్నారని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వంలో వర్షాలు ఉన్నప్పటికీ, సాగునీటి కొలత ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. ఆనాటి ఎమ్మెల్యే నిమ్మల రైతుల పొలాల వద్ద రాత్రి, పగలు కాపు కాసి రైతులకు అవసరమైన చోట తన సొంత సొమ్ములతో ఇంజన్లతో నీటిని సరఫరా చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాలకొల్లు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దామని కోట్లాది రూపాయల నిధులు తీసుకువస్తున్న మంత్రి పనితనాన్ని ప్రజలు రైతులు గమనిస్తున్నారని వైసీపీ పార్టీ వారు తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రజల్లోకి భయం కలిగించే సందేశాలు పంపటం వల్ల వైసీపీ పార్టీ ప్రతిష్ట మరింత దిగజారుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండల టిడిపి అధ్యక్షులు మామిడి శెట్టి పెద్దిరాజు, జిల్లా ఎస్సీ సెల్ నాయకులు పీతల శ్రీనివాస్,డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు పెనుమత్స రామభద్ర రాజు, నీటి సంఘం అధ్యక్షులు ఆరమిల్లి రామ శ్రీనివాస్, యలమంచిలి సొసైటీ అధ్యక్షులు బొప్పన హరికిషోర్, ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరి ఆంజనేయులు, సర్పంచుల ఛాంబర్ మాజీ అధ్యక్షులు కడలి గోపాల్ రావు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు