భీమవరం: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్)జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా, జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
గ్రామ పంచాయతీలకు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా విస్తృత అధికారాలు లభించాయని, స్థానిక వనరులను సమర్థంగా వినియోగించి గ్రామాభివృద్ధి సాధించవచ్చని కలెక్టర్ గారు పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో మౌలిక వసతులు, పర్యావరణ పరిరక్షణ, విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి సంబంధించిన 29 అంశాలను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించారని, అధికారులు సమన్వయంతో పనిచేస్తే గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల్లో ప్రతిభ కనబరిచిన 47 మంది అధికారులు, ఉద్యోగులను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మెమెంటోలు, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీవోలు, సిబ్బంది పాల్గొన్నారు.

ఉద్యోగులకు ప్రతిపాపరస్ కారాలు అందజేస్తున్న, కలెక్టర్, సంయుక్త కలెక్టర్