భీమవరం: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లాలో జల జీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో, రూ.1400 కోట్లతో 862 గ్రామాల రక్షిత మంచినీటి కోసం ప్రాజెక్ట్ అమలు జరుగుతోందని, 13.25 లక్షల కుటుంబాలకు త్రాగునీరు అందుతుందని తెలిపారు. ఇప్పటివరకు 105 కి.మీ పైపులైన్ పూర్తయ్యిందన్నారు. రహదారులు, కాల్వలు దెబ్బతినకుండా పనులు చేయాలని సూచించారు. నిర్మాణ నాణ్యత, అనుమతులు, ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

జల్ జీవన్ మిషన్ సమావేశం నిర్వహిస్తున్న కలెక్టర్ నాగరాణి