Telugu News Power

పాలకొల్లుకు రూ. 5 కోట్లతో వ్యర్ధాల నిర్వహణ ప్రాజెక్టు.

స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం పై మాట్లాడుతున్న మంత్రి నిమ్మల, చైర్మన్ పట్టాభిరామ్.

పాలకొల్లు: ఏప్రిల్, 21(తెలుగు న్యూస్ కావాలి. కామ్) వ్యర్ధాల నిర్వహణకు సంబంధించి ఆధునిక ప్రాజెక్టు ఐదు కోట్ల రూపాయలతో పాలకొల్లులో ఏర్పాటు చేయనున్నట్టు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, పట్టాభిపురం మంగళవారం పాలకొల్లులో ఎడ్ల బజారు వద్ద, సూర్య తేజ శివారుణ ఉన్న డంపింగ్ యార్డ్లను పరిశీలించారు. వ్యర్ధాల నిర్వహణ ఎప్పటికీ చాలా వరకు పూర్తయిందని, ఇంకా 57,600 మెట్ ట్రిక్ టన్నుల బయో మైనింగ్ కు ఆదేశాలు జారీ చేశామన్నారు. భవిష్యత్తులో తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించటానికి ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందువల్ల చెత్త నుంచి సంపద సృష్టించడానికి వీలవుతుందన్నారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో దాసిరాజు, మున్సిపల్ కమిషనర్ బి విజయ సారథి, డి ఈ రాజ కుమార్ పాల్గొన్నారు.