పాలకొల్లు: ఏప్రిల్, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) యలమంచిలి మండలం, బూరుగుపల్లి గ్రామంలో ఈనెల 16న రాత్రి నూకాలమ్మ జాతరలో జరిగిన హత్య, మరొకరిపై హత్యా ప్రయత్నం పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్టు పోలీసులు వివరాలు వెల్లడించారు. దేవరపు వీరస్వామి అనే వ్యక్తి జనసమూహంలో జాతర చూస్తుండగా నిందితులు కారుతో ఢీ కొట్టి అతని మరణానికి కారణం అయ్యారు. ఈ దాడిలో మౌనం శ్రీరామ్ కృష్ణ పై కూడా హత్యాయత్నం చేసినప్పటికీ బాణం శ్రీ రామకృష్ణ తృటిలో తప్పించుకున్నారు. ఈ సందర్భంగా, శ్రీరామకృష్ణ ఉన్నాడనే ఉద్దేశంతో వీరస్వామిని తీసుకు వెళ్తున్న కారుపై నిందితులు మరోసారి దాడికి దిగారు. అయితే అందులో శ్రీరామకృష్ణ లీల మీద నిర్ధారించుకున్న తర్వాత నిందితులు పారిపోయారు. జిల్లా ఎస్పీ నయీమ్ హస్మి ఆదేశాల మేరకు, నర్సాపురం డిఎస్పి ఎం సుధాకర్ రావు, పాలకొల్లు రూరల్ సీఐ జి. శ్రీనివాస్, ఇతర అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో సమర్థవంతంగా సకాలంలో ఛేదించారు. ఈ కేసు కు సంబంధించి 15 మంది నిందితులు ఉన్నట్టు గుర్తించారు. నిందితులు ఉపయోగించిన ఏపీ 39 హెచ్ సి 5678 నెంబర్ కారు మహేంద్ర తార్, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు ఆశ్రయం ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయిన నిందితులు, 1. బోనం గణేష్ కుమార్, పలివెల భరత్, కెల్లా వెంకట సుబ్రహ్మణ్యం, మానుకొండ కిరణ్, గురుపాక సాయి దుర్గారావు, కొడవటి సాయి రామ్మోహన్ రావు, నాటిన తరుణ్ కుమార్, గంట సాయి శ్రీనివాస్, నవళం రవి ఉన్నారు. ఇంతకుముందు వీరిలో నలుగురికి ఇంతకుముందే రౌడీషీట్ ఉంది. నిన్నితుల కోసం ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శాంతి భద్రతలు కలిగించే వారిపై ఉక్కు పాదం మోపుతామని పోలీసులు హెచ్చరించారు.
బూరుగుపల్లి హత్య కేసులో నిందితుల అరెస్ట్.
బూరుగుపల్లి హత్య కేసులో అరెస్ట్ అయిన నిందితులు