Telugu News Power

ప్రత్యేక కార్యక్రమంలో దివ్యాంగుల అర్జీలు స్వీకరించిన కలెక్టర్.

దివ్యాంగుల నుంచి అర్జీ సేకరిస్తున్న కలెక్టర్

భీమవరం: ఏప్రిల్, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్)జిల్లాలో దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం శుక్రవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 15 అర్జీలు స్వీకరించి నట్టు తెలిపారు. ఆరోగ్యం, పెన్షన్, ఉపాధి, బ్యాంకు రుణాలు వంటి సమస్యలపై దృష్టి సారించినట్టు తెలిపారు. ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
దివ్యాంగులు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సేవాభావంతో స్పందించాలని, నిరుద్యోగులకు జాబ్ మేళాలు, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.