Telugu News Power

బూరుగుపల్లి లో ఘోరం, వృద్ధుడ్ని కారుతో ఢీ కొట్టిన వైనం.

మృతుడు దేవరపు వీరస్వామి (దాచిన చిత్రం)

యలమంచిలి: ఏప్రిల్, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బూరుగుపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారి జాతర గురువారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్రంగా రక్షణ ఏర్పడింది. చౌక దుకాణం మాజీ డీలర్ కృష్ణ కుమారుడు బోణం గణేష్ బయటనుంచి కొందరు వ్యక్తులను బయట నుంచి తీసుకువచ్చి జాతరలో బీభత్సం సృష్టించినట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ హఠాత్పరిణామానికి జాతరలో పాల్గొని జనం చెల్లాచెదురయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సొసైటీ మాజీ అధ్యక్షులు,బోణం శివరామకృష్ణ, బోణం నాయుడు తన సొంత బంధువులు కాగా, వారినే లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్టు చెబుతున్నారు. ఈ ఘర్షణలో కారు వేగంగా వచ్చి దేవరపు వీరస్వామి (75) అనే వృద్ధుని ఢీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. తీవ్రంగా గాయపడిన వీరాస్వామిని పాలకొల్లు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచారని బంధువులు వెల్లడించారు. ప్రశాంతమైన మండలంలో, మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలాంటి అసాంఘిక దాడులతో శాంతి భద్రతలకు విభాగం కల్పించడం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. స్థానిక ఎస్సై గురవయ్యను వెంటనే సస్పెండ్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. గతంలో కూడా ఇతని వల్ల బూరుగుపల్లి లో
స్వకుటుంబీకులు ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. అప్పుడు ఇతని వెనక ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాధితులు కేసు నమోదు చేయమని కోరగా పోలీసు వారు నమోదు చేయలేదని ఆరోపణలు వచ్చాయి. జిల్లా ఎస్పీ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత మాత్రమే కేసు నమోదు చేశారని బాధితులు వాపోయారు.