పాలకొల్లు: ఏప్రిల్, 18(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జికేఆర్ చాంబర్స్ డిగ్రీ , పీజీ కళాశాలలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం 20వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా, ఉపకులపతి ప్రొఫెసర్ ప్రసన్న ఆదేశాల మేరకు, ఎన్ఎస్ఎస్ మూడు యూనిట్ లు, ఉన్నత భారత అభియాన్ వారి సహకారంతో 20 మొక్కలు నాటే కార్యక్రమాన్ని కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేవీఆర్ నరసింహారావు మాట్లాడుతూ, మొక్కలు నాటడం ప్రతి పౌరుని యొక్క ప్రాథమిక విధి అని , మారుతున్న పర్యావరణ సమతుల్య పరిస్థితుల్ని మార్చేందుకు, భూతాపాన్ని తగ్గించుకునేందుకు మొక్కలు విధిగా నాటి పెంచాలని కోరారు. వృక్షో రక్షిత రక్షితః అని, యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా”ఒక సంతకం – ఒక జ్ఞాపకం” కార్యక్రమంలో 600 మంది విద్యార్థులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సంతకాలు చేశారు. వీటిని ఆదికవి నన్నయ యూనివర్సిటీ కి పంపిస్తామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి. వెంకటేశ్వరరావు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కేవీ సీతారామరాజు, కళాశాల ట్రెజరర్ ఆర్. ప్రవీణ్ భాను, అకాడమిక్ అడ్వైజర్స్ ఏబిఎస్ మూర్తి, నందుల సీతారామ రావు , జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కారుమూరి బాబ్జి, ఎన్ ఎస్ ఎస్ యూనిట్స్ కోఆర్డినేటర్స్ రాంబాబు, రాధా మాధవి అధ్యాపకులు ఎన్ రవికుమార్, జానకిరామయ్య, మీనా తదితరులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
చాంబర్స్ కళాశాలలో “మనవృక్షం – మన భవిష్యత్తు”
చాంబర్స్ కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం