పాలకొల్లు: జూన్, 8 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
మండల మానవత శాఖకు నూతన అధ్యక్షుడిగా(2026-27) ముత్యాల రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించి
మండల సర్వసభ్య సమావేశం సోమవారం రాత్రి జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. పాలకొల్లు
మండలశాఖ ఆవిర్భావం నుంచి ముత్యాల రామారావు డైరెక్టర్స్ బోర్డ్ కన్వీనర్ గా వ్యవహరిస్తూ, సేవాకార్యక్రమాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరు గత 28 ఏళ్లుగా లయన్స్ క్లబ్ లో వివిధ హోదాలలో సేవలందించారు. ప్రస్తుత అధ్యక్షుడు బొక్క రమాకాంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉపాధ్యక్షునిగా, ధనాని సూర్యప్రకాష్, కార్యదర్శిగా ఇంటి శివరామగోపాల్, సహాయ కార్యదర్శిగా శిద్ధిరెడ్డి వేణుగోపాలస్వామి, కోశాధికారిగా దేవళ్ల రవికిరణ్, కార్యవర్గ సభ్యులుగా జక్కంపూడి రామప్రసాద్, షేక్ పీర్ సాహెబ్, గుడాల హరిబాబు, ముత్యాల శ్రీవాత్సవ ప్రదీప్ ఎన్నికయ్యారు.మండల డైరెక్టర్స్ బోర్డ్ చైర్మన్ డాక్టర్ కె.ఎస్.పి.ఎన్. వర్మ, జిల్లా కమిటీల డైరెక్టర్స్ ముత్యాల శ్రీనివాస్, పి.ఎస్. ప్రతాపరాజు, మద్దాల శ్రీనివాసరావు (వాసు), కార్యదర్శి ముత్యాల శ్రీవాత్సవ ప్రదీప్, పలువురు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉల్లంపర్రు, మాంటిసోరీస్ విద్యాసంస్థల అధినేత, మద్దాల శ్రీనివాసరావు (వాసు) నూతన కార్యవర్గానికి అభినందన పూర్వకంగా, రూ.10 వేలు విరాళం అందజేశారు.
‘మానవత’ నూతన అధ్యక్షునిగా ముత్యాల రామారావు ఏకగ్రీవం.