Telugu News Power

మెగా ఫ్యామిలీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు.

మెగా ఫ్యామిలీ పై అనుచితి వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు కోరుతూ సజ్జనార్ కు ఫిర్యాదు అందజేస్తున్న స్వామి నాయుడు వెంకటేష్

హైదరాబాద్: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాంచరణ్, నీహారిక వ్యక్తిగత జీవితాలను స్టాండప్ కామెడీ పేరిట కించపరుస్తూ అనుదీప్ కటికాల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ, అనుదీప్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి సి సజ్జనార్ కలిసి ఫిర్యాదు చేసినట్టు అఖిలభారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షులు రవణం స్వామి నాయుడు, తెలంగాణ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షులు వేల్పుల వెంకటేష్ గురువారం తెలిపారు.
దీనిపై సజ్జనార్ స్పందించి, వెంటనే విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని మీ ఇచ్చినట్టు తెలిపారు. మరికొంత మంది స్టాండప్ కమెడియన్స్ సైతం మెగా ఫ్యామిలీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
మెగా ఫ్యామిలీపై వ్యక్తిగత దూషణలకు ఎవరు పాల్పడినా వారిని కఠినంగా శిక్షించే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు తెలియజేసారు.