Skip to main content

Telugu News Power

రేషన్ కార్డు సమస్యల పరిష్కారం అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.

రేషన్ దుకాణం వద్ద వినియోగదారులు

అమరావతి: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్) చాలా కాలంగా, రాష్ట్రం లో రేషన్ కార్డుదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. రేషన్ కార్డు దారులకు 9 సేవలు సులభంగా అందుకోవడానికి మార్గం సుగమం చేసింది. కొత్త రేషన్ కార్డు, కుటుంబ సభ్యులు చేర్పు, సభ్యుల తొలగింపు, కార్డులు కుటుంబాల ద్వారా విభజించడం, చిరునామా వివరాల మార్పు, కార్డు పోగొట్టుకున్న వారికి మరో కార్డు ఇవ్వడం, ఆధార్ తో లింక్ చేయటం, సెల్ ఫోన్ నెంబర్ మార్పు వంటి సమస్యలు ఇక తీరనున్నాయి. సమీపంలో ఉన్న మీసేవ కేంద్రాల్లో గాని, మనమిత్ర, వాట్సాప్ నెం.9552300009 ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చని పోరు సరఫరాల శాఖ ప్రకటించింది. ఆధార్ కార్డు, తదితరులు రుజువులు సమర్పించవలసి ఉంటుంది. ఈ సేవలు ఉ
పొందటానికి గరిష్టంగా 200 రూపాయలు ఫీజు చెల్లించాలి.