Skip to main content

Telugu News Power

మోడీ, పుష్కరకాల ప్రధానమంత్రిగా, పాలనకు మద్దతుగా పూజలు.

క్షీరారామంలో బిజెపి నాయకులతో ఎంపీ పాక వెంకట సత్యనారాయణ

పాలకొల్లు: జూన్,10(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతదేశంలో సర్వతోముఖ అభివృద్ధి వైపు నడిపిస్తున్న ప్రధాని మోడీ పుష్కరకాలం పాలనకు మద్దతుగా రాజ్యసభ సభ్యులు, పాక వెంకట సత్యనారాయణ బుధవారం క్షీరారంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా, ఎంపీకి, పూర్ణకుంభంతో ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. క్షీరా రామ క్షేత్రంలో వేంచేసి ఉన్న విఘ్నేశ్వరునికి, మహాదేవునికి పూజలు చేశారు. మోడీ సుస్థిర పాలనలో ప్రపంచంలోనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందు ఉండాలని, ప్రపంచంలో నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని, భారతదేశానికి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలని ఆకాంక్షిస్తూ, స్వామివారికి మొక్కుకున్నట్లు ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో, బిజెపి రాష్ట్ర నాయకులు ఉన్నమట్ల కపర్తి, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, కొల్లి కొండ ప్రసాద్ జక్కంపూడి కుమార్, శ్యామల, గౌరీ,సురేఖ తదితరు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.