Skip to main content

Telugu News Power

యార్లగడ్డకు అమెరికాలో తెలుగులో పట్టా.

పట్టా అందుకుంటున్న శివరాం ప్రసాద్

జనరల్ డెస్క్: జూన్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాజ్యసభ మాజీ సభ్యులు, జాతీయ హిందీ అకాడమీ మాజీ అధ్యక్షులు, ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాతృభాష పట్ల తన అభిమానాన్ని చాటు కొన్నారు. వారి కుమారులు యార్లగడ్డ శివరామ ప్రసాద్ చేత ఎం.ఏ తెలుగు చదివించారు. అమెరికాలోని ఆరియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఇటీవల జరిగిన విశ్వవిద్యాలయ స్నాతకోత్స కార్యక్రమంలో వారికి పట్టా అందజేశారు. ఈ సందర్భంగా, మాజీ డిప్యూటీ స్పీకర్, మండలి బుద్ధ ప్రసాద్, మాజీ కేంద్రమంత్రి, ఎమ్మెల్యే సుజనా చౌదరి, గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్ జీవీ పూర్ణ చంద్ అభినందనలు తెలియజేశారు.