Telugu News Power

యుటిఎఫ్ సంఘం లోకి భారీగా చేరికలు.

కొత్త సభ్యులకు స్వాగతం పలుకుతున్న గణపవరం మండల శాఖ, జిల్లా నాయకులు

గణపవరం: ఏప్రిల్, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) యుటిఎఫ్ శాఖలోకి నూతనంగా సభ్యత్వాన్ని తీసుకొని పలువురు ఉపాధ్యాయులు బుధవారం సంఘంలో చేరారు. సభ్యులుగా
చల్లా కృష్ణ ,గంగరాజు మాస్టర్,మాకా ప్రసాద్,నక్క రాంబాబు,మద్దాల జగన్నాథ స్వామి, గొర్రెల దుర్గా ప్రసాద్, సభ్యత్వం స్వీకరించారు. వీరికి స్వాగతం పలుకుతూ, గణపవరం మండల శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజు, ప్రధాన కార్యదర్శి పి క్రాంతి కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ లో చేరిన ఉపాధ్యాయులను అభినందించారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంక్షేమానికి యుటిఎఫ్ గణపవరం మండలం శాఖ తో కలిసి పనిచేయటానికి నిర్ణయించుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్ రత్నరాజు కుటుంబ సంక్షేమ సంఘం డైరెక్టర్ హెచ్.ఎస్.వి ఆంజనేయులు మండల శాఖ అధ్యక్షులు ఎమ్మెస్ ఎల్ ఎస్ ఎస్ నారాయణ ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు శర్మ గారు బి రమేష్ పూర్వ ప్రధాన కార్యదర్శి జి భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు