Telugu News Power

శ్రీ శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో ఘనంగా ఆదిశంకరుల జయంతి ఉత్సవం.

శంకరాచార్య జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ధర్మకర్తలు,ఈవో

భీమవరం: ఏప్రిల్, 22(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక శ్రీ శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో బుధవారం
ఘనంగా ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవం జరిగింది. జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతిని పురస్కరించుకుని అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దేవస్థాన మండపంలో ఏర్పాటు చేసిన విశేష కార్యక్రమం లో శ్రీ ఆదిశంకరుల చిత్రపటానికి దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో దేవస్థానం వైదిక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆదిశంకరాచార్యులు కేవలం 32 ఏళ్ళ స్వల్ప కాలంలోనే సనాతన ధర్మాన్ని ఏ విధంగా ఉద్ధరించారో, వారు రచించిన స్తోత్రాలు, భాష్యాల ద్వారా అర్ధం అవుతుందన్నారు.
భారతీయ తత్వశాస్త్రంలో శంకరులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతం యొక్క గొప్పతనాన్ని, నేటి సమాజానికి దాని ఆవశ్యకత తెలియపరచవలసిన
ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. హైందవ ధర్మ పరిరక్షణకు దేశం నలుమూలల నాలుగు పీఠాలను స్థాపించి, సాంస్కృతిక సమైక్యతకు వారు చేసిన కృషిని ధర్మకర్తలు కొనియాడారు.ఆదిశంకరాచార్యులు చూపిన ధర్మ మార్గం మానవాళికి దిక్సూచి వంటిదని. వారి బోధనలను స్మరించుకోవడం మనందరి బాధ్యత.” అని చైర్మన్ బొండాడ నాగభూషణం పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు రామాయణంశ్రీనివాస్,ఉదిసి మీనాక్షి ,మీర్తిపాటి గుణేశ్వరరావు, పాపొలు ఏడుకొండలు దేవస్థానం అధికారులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో శంకరాచార్య జయంతి నిర్వహించారు.