Telugu News Power

లయన్స్ ఫెమినా ఆరోగ్య కార్యక్రమం.

పాలకొల్లు; ఏప్రిల్, 25(తెలుగు న్యూస్ పవర్. కామ్) లయన్స్ ఇంటర్నేషనల్ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా, స్థానిక లయన్స్ ఫెమినా క్లబ్ ఆధ్వర్యంలో ఉల్లంపర్రు, మాంటిసోరి, పాఠశాలలో శనివారం హెచ్.పి.వి టీకా కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ ఇంటర్నేషనల్ వారి సౌజన్యంతో 125 మంది యువతులకు టీకాలు వేశారు. ఇటీవల మహిళలకు సర్వికల్ క్యాన్సర్ పెనుముప్పుగా మారింది. దీని నివారణకు హెచ్ పి వి టీకా అందుబాటులో ఉంది. ఖరీదైన టీకా అందరూ వేయించుకోలేని పరిస్థితి. లయన్స్ ఇంటర్నేషనల్ సామాజిక ఆరోగ్య కార్యక్రమంలో రూ. 10 వేలు విలువైన టీకా ఉచితంగా వేయిస్తున్నారు. ఈ టీకా తో మహిళలకు సంభవించే నాలుగు రకాల (టైప్ 6,11,16,18) క్యాన్సర్లను నిరోధిస్తుంది. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ సూచనలు మేరకు 12 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మహిళల వరకు ఈ వ్యాక్సిన్ దీర్ఘకాలం వ్యాధి నుంచి కాపాడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి లయన్స్, జి ఏ టి, వావిలాల సరళ దేవి టీకా శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా గవర్నర్ ఎన్ వి వి ఎస్ పాపారావు నాయుడు, జిల్లా ఫస్ట్ లేడీ, ఎన్ ఎన్ ఏ అన్నపూర్ణ, జోన్ చైర్ పర్సన్,ప్రిన్సిపల్ సామవేదం వసంత లక్ష్మి, అధ్యక్షులు మీనా మణి దీప్తి, కార్యదర్శి, కావలి మౌని, కోశాధికారి డి. మౌనిక, డాక్టర్ జయ భారతి రెడ్డి, ఎస్ కామేశ్వరరావు, ముచ్చర్ల సత్యనారాయణ, దోనెల ప్రసాద్, శిడగం ఈశ్వర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాంటిసోరి
పాఠశాల యాజమాన్యం ఇఃదుకు తగిన ఏర్పాట్లు చేసి
సహకరించింది.

విద్యార్థికి హెచ్ పి వి టీకా వేస్తున్న దృశ్యం