Telugu News Power

విద్యార్థులకు 100 సైకిళ్ళు ఉచిత పంపిణీ.

కుందేరు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి నిమ్మల
యూనియన్ బ్యాంక్ అధికారులను సత్కరిస్తున్న మంత్రి నిమ్మల

యలమంచిలి: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కొంతేరు ఉన్నత పాఠశాలలో ఆదివారం విద్యార్థులకు మంత్రి నిమ్మల చేతుల మీదుగా ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కొంతేరు, కాజ ఉన్నత పాఠశాలల విద్యార్థులు 100 మందికి సైకిల్ ఉచితంగా పంపిణీ చేశారు. యూనియన్ బ్యాంక్ తమ
సి ఎస్ ఆర్ నిధుల నుంచి ఈ సైకిళ్ళ పంపిణీ కోసం నిధులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా మంత్రి, యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ ఉదయగిరి సుబ్రహ్మణ్యం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. మంత్రికి ఘన స్వాగతం పలికారు. విద్యార్థుల తల్లిదండ్రులు విశేషంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్థి, పెనుమత్స రాంభద్ర రాజు, అంజిబాబు, కడలి గోపి, మామిడిశెట్టి పెద్దిరాజు, పేదల శ్రీనివాస్, బోనం నాని, ఉన్నమట్ల ప్రేమ్ కుమార్, చిలుకూరి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.