యలమంచిలి: ఏప్రిల్, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్).విద్యార్థుల ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమానికి ప్రేరణ, తనను కలిసిన విద్యార్థులు సైకిల్ ఇప్పించవలసినదిగా పలుచోట్ల కోరడమే కారణమని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఉచిత సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ 135వ పుట్టినరోజు అయిన మంగళవారం యలమంచిలి మండలంలో ప్రవేశించింది. దొడ్డిపట్ల, ఇలకుర్రు గుంపర్రు, మట్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 200 సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం వద్ద ఇలాంటి పథకం అందుబాటులో లేనందున, విద్యార్థుల చదువుకు, పేదరికం అడ్డు రాకూడదని, విద్యార్థులు చదువుకొనేల ప్రోత్సహించడానికి ఉచిత సైకిల్ పథకం ఎంతగానో తోడ్పడుతుందని ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా, ఎక్కడా లేని విధంగా పాలకొల్లు నియోజకవర్గంలో అమలు చేస్తున్నామని వెల్లడించారు. రాజకీయాల్లోకి రాకముందు తన తండ్రి ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు 2005 నుంచి నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవా కార్యక్రమాల పరిధిని విస్తృతం చేశామన్నారు. ఫౌండేషన్ ద్వారా చేపట్టిన వివిధ సంక్షేమ సేవా కార్యక్రమాల గురించి వివరించారు. సైకిళ్లు ఉచితంగా ఇవ్వడానికి సి ఎస్ ఆర్ నిధులతో సహకరించిన యూనియన్ బ్యాంక్ వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తనకు వ్యక్తిగతంగా, రాజకీయంగా, మంత్రిగా, పార్టీలో సముచిత స్థానం ఉండటం వల్ల అందరి సహకారంతో నియోజకవర్గాన్ని ఆర్థిక ప్రతిబంధకాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నానని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రూ. 5 కోట్లతో నైపుణ్య అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజా సేవలో ప్రాణాలు తెగించి కరోనా, వరదల్లో ప్రజలకు అండగా నిలిచినట్టు గుర్తు చేశారు. పని చేసే ప్రభుత్వానికి పది కాలాలపాటు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ, రాజకీయం, సేవా కార్యక్రమాలు సమన్వయంతో చేయటం సాధ్యం కాదని, అలాంటి అసత్యాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు సుసాధ్యం చేస్తున్నారని కొనియాడారు. యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఉదయగిరి సుబ్రహ్మణ్యం, మాట్లాడుతూ, ఉగాది, అంబేద్కర్ జయంతి వంటి పర్వదినాల్లో ప్రజలకు తమ బ్యాంకు ద్వారా ప్రయోజనం కలిగిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. సి ఎస్ ఆర్ నిధులు ఇంతవరకు ఎక్కడ సైకిల్ పంపిణీ కార్యక్రమానికి ఇవ్వలేదని, మంత్రి నిమ్మల, విద్యార్థులకు సైకిల్ అవసరం గురించి సమగ్రంగా తెలియజేయడం వల్ల బ్యాంకు నిధులు మంజూరు చేసిందన్నారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ . ఎం వెంకన్న బాబు మాట్లాడుతూ, పదో తరగతిలో విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించి, ఆయన కోర్సుల్లో ప్రవేశం ఇప్పించే విధానానికి విద్యాశాఖ పరిశీలించేలా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో, మాజీ జెడ్పిటిసి, బోనం నాని, తమ్మినీడి నరసింహా రావు,నీటి సంఘం అధ్యక్షులు పెనుమత్స రాంభద్ర రాజు, ఆరమిల్లి రామ శ్రీనివాస్ చిట్టూరి ఆంజనేయులు, సొసైటీ అధ్యక్షులు బొప్పన హరి కిషోర్, డేగల సత్తి కొండ, ఎంపీటీసీ డేగల సూర్యకుమారి వెంకటేశ్వరరావు, రావూరి అప్పారావు, పితల శ్రీనివాస్, మామిడి శెట్టి పెద్దిరాజు, కొడవటి వరబాబు, గంటా శ్రీనివాస్, ఎంఈఓ ఎ. వాణి, రామకృష్ణంరాజు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విద్యార్థులకు 200 ఉచిత సైకిళ్ల పంపిణీ.
విద్యార్థినితో ముచ్చటిస్తున్న మంత్రి నిమ్మల