Skip to main content

Telugu News Power

శ్రామికులకు మంత్రి విందు

పాలకొల్లు: జూన్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న శ్రామికులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు శ్రమైక జీవన సౌందర్యాన్ని గుర్తిస్తూ, వారికి చీరలు బహుమతిగా ఇస్తూ, విందు భోజనం ఏర్పాటు చేసి గౌరవిస్తున్నారు. ఈ పరంపరలో భాగంగా, శనివారం స్థానిక చింతపర్రు గ్రామంలో ఈ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి శ్రామికులకు మజ్జిగ చలివేంద్రాలు నిర్వహించిన దాతలకు, శ్రేణులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తన మంత్రి పదవిని పక్కనపెట్టి, సామాన్య సోదరునిలా, ఉపాధి శ్రామికులల్లో కలిసి పోయారు. వారితో సరదాగా ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమామహేశ్వర రావు, ఎంఈఓ గుమ్మల్ల వీరస్వామి,మండల టిడిపి అధ్యక్షులు పాముల రజిని కుమార్,పెనుమత్సశ్రీనివాసరాజు, లోకేష్, సత్యనారాయణ, సతీష్, సంజీవులు తదితరులు పాల్గొన్నారు.