Skip to main content

Telugu News Power

ఫీడ్ రేట్ల పెంపు పై రొయ్యల రైతుల ఫైర్ ఈ నెల 16 నుంచి ఉద్యమ కార్యాచరణ అవసరమైతే చలో అమరావతికి పిలుపు.

పాలకొల్లు: జూన్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
అకస్మాత్తుగా, ఎవరి అనుమతులు లేకుండా, రాత్రికి రాత్రే, దొడ్డిదారిలో అడ్డంగా పెంచిన ఫీడ్ ధరలపై ఆక్వా రైతులు ఫైర్ అయ్యారు. జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో చందపర్రు త్రిబుల్ ఎస్ కళ్యాణమండపం లో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. వీడు ధరలు పెంచవద్దని తాము ఎంతో కాలంగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా, పెడచెవిన పెట్టి ఒక్కసారిగా కిలోకు 10 నుంచి 12 రూపాయల వరకు పెంచడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆక్వా రైతు సంఘ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ, రొయ్యల దాన పెంపు విషయంలో ఏ విధమైన విధివిధానాలు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అప్సడా కమిషన్ నియమ నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. కమిషన్ చైర్మన్, డైరెక్టర్లులకు కూడా కనీసం తెలియకుండా, రొయ్యల రైతుల నడ్డి విరిచే దుర్మార్గానికి ఒడికట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. రొయ్యల రైతులపై గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్న వారిని నిరసిస్తూ ఈనెల 16న ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నట్టు భగవాన్ రోజు వెల్లడించారు. ధరలు తగ్గించడానికి అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా వెనకాడ ఇది లేదని హెచ్చరించారు. అవసరమైతే చలో అమరావతి పిలుపునిచ్చి లక్షలాది మంది రైతులతో ఉద్యమం చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ఆక్వాసంఘ కార్యదర్శి, త్సవటపల్లి నాగభూషణం(అమలాపురం) మాట్లాడుతూ, సిండికేట్ల మాయలో పడి, ప్రభుత్వం రొయ్యల రైతులపై శీతకన్ను వేయటం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మేడిది జాన్ డేవిడ్ రాజు, పెనుమత్స సత్యనారాయణ రాజు, కృష్ణ, అంగర విజయ ప్రసాద్,ఇంటి శ్రీరాముడు, తదితరులు పాల్గొన్నారు.