Skip to main content

Telugu News Power

స్పెయిన్‌ను చుట్టేస్తున్న దావానలం. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన.

స్పెయిన్ లో కార్చిచ్చు


మేడ్రిడ్: జూలై,28( తెలుగు న్యూస్ పవర్. కామ్) పకృతిలో వచ్చే తీవ్ర మార్పుల వల్ల ఎల్నినో రంగ ప్రవేశం చేసింది. భూగోళం తీవ్ర ఉష్ణోగ్రతలతో కుత కుత ఉడికిపోతున్నది. మంచు దేశాల్లో మంటలు పుట్టిస్తున్నది. ప్రజలు తీవ్ర ఉష్ణోగ్రతలతో తట్టుకోలేక రోడ్ల మీదకు వచ్చి ఆహాకారాలు చేశారు. ఇప్పుడు ఈ తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల మరో ముప్పు ముంచుకొచ్చింది.స్పెయిన్‌లో కార్చిచ్చులు తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మాడ్రిడ్‌కు సమీపంలో, అవిలా ప్రాంతంలో దావానలాలు వేగంగా వ్యాపిస్తుండటంతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మాడ్రిడ్ రాజధానికి 50 కిలోమీటర్ల సమీపంలోని ప్రాంతాల నుంచి 10వేల మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించారు,అగ్నిమాపక సిబ్బంది 270 మంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు.
స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ ఈ పరిస్థితిని “నాటకీయమైనది” అని అభివర్ణించారు, ఇది స్పెయిన్‌తో పాటు పొరుగు దేశాలలో కూడా నెలకొందని పేర్కొన్నారు. పొరుగున ఉన్న ఫ్రాన్స్‌లో కూడా బోర్డియో సమీపంలో భారీ మంటలు చెలరేగడంతో, 60 వేల మందికి పైగా నివాసితులు తమ ఇళ్ల నుంచి తరలివెళ్లారు.
మాడ్రిడ్ ప్రాంతంలో మంటలు దాదాపు 45వేల హెక్టార్లను దహనం చేశాయని, 90వేల మందికి పైగా ప్రజలు ఖాళీ చేయాల్సి వచ్చిందన్నారు. ఇటలీ, పోర్చుగల్ దేశాలు కూడా స్పెయిన్‌కు సహాయ సిబ్బందిని పంపాయి. ఇప్పుడు ఇటలీకి కూడా ఈ ప్రమాదం పాకింది. మంటల నుంచి మూగ జీవులు తీవ్రభయాందోళనతో పరుగులు తీస్తున్నాయి. ప్రతి 15 ఏళ్లకు ఒకసారి ప్రకృతిలో సంభవించే ఈ మార్పుల వల్ల ఎల్నినో, లానినో పడతాయి. ఇందువల్ల తీవ్ర కరువు కాటకాలు, కుంభవృష్టి వరదలు సంభవించి ప్రజలను అతలాకుతనం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.