భీమవరం: ఏప్రిల్, 25(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్వాతంత్ర సమరయోధులు, విద్యాదాత, మహనీయులు, “సంకల్ప జీవి” దంతులూరి నారాయణ రాజు గారి విగ్రహాన్ని స్థానిక ఎంపీ, కేంద్ర సహాయ, ఉక్కు ,భారీ పరిశ్రమల శాఖమాత్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ శనివారం ఆవిష్కరించారు.విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని నమ్మి, 1945లోనే భీమవరంలో కళాశాలను స్థాపించి, సామాన్యులకు విద్యను చేరువ చేసిన గొప్ప కృషీవలుడు నారాయణ రాజు సేవలను మంత్రి కొనియాడారు. దేశభక్తుడు, విద్యాదాత వంటి గొప్ప మహనీయుని విగ్రహాన్ని ఈ ప్రాంతంలో నెలకొల్పడం ఎంతో గర్వకారణం అన్నారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులుపాక సత్యనారాయణ , ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, డీ.ఎన్.ఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు నరసింహారాజు, పాలకవర్గ సభ్యులు, నారాయణ రాజు అభిమానులు ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు.

విద్యాదాత దంతులూరి విగ్రహం