నరసాపురం: ఏప్రిల్, 25(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపి విభాగాన్ని పరిశీలించి రోగుల నమోదు ఆరా తీశారు. అప్పటివరకు 20 కేసులే వచ్చాయి. ఓపి ఇంత తక్కువగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. హాజరు పట్టికలను పరిశీలించి వైద్యులు, సిబ్బంది హాజరును పేరుపేరునా పరిశీలించారు. అనంతరం పురుషుల వార్డు, స్త్రీల వార్డు, అత్యవసర విభాగం, ప్రసూతి విభాగం, పిల్లల విభాగం, హెచ్ఐవి చికిత్స గది, డ్రెస్సింగ్ రూమ్, ఫిజియోథెరఫీ విభాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో వసతులు ఎలా ఉన్నాయి, వైద్యులు అందుబాటులో ఉంటున్నారా, మందులు హాస్పిటల్ లోనే ఇస్తున్నారా, డబ్బులు ఎవరైనా వసూలు చేస్తున్నారా తదితర సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పై రోగులకు నమ్మకం కలిగేలా వైద్యులు తమ సేవలు మెరుగుపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో, వైద్యులు, సిబ్బంది కలెక్టర్ ఆదేశాలు పాటిస్తామని తెలిపారు

ఆసుపత్రిలో సేవలు గురించి అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్