సోషల్ మీడియా వికృతి చేష్టలకు చెక్ పెట్టనున్న కూటమి ప్రభుత్వం. -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి: జూలై, 1( తెలుగు న్యూస్ పవర్. కామ్) సోషల్ మీడియా వికృతి చేష్టలకు చెక్ పెట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇందులో సైబర్ నేరాలకు సంబంధించిన శాఖ, పోలీసులు, చట్టాన్ని అమలుపరిచే వివిధ శాఖలు ఉమ్మడిగా సోషల్ మీడియా వికృతి ధోరణులను ఎప్పటికప్పుడు తమ నిఘాతో కనిపెడతాయని చెప్పారు. వాటిపై వెంటనే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వ్యక్తిగత స్వేచ్ఛకు…