Skip to main content

Telugu News Power

కార్తీక మాసం లో ఓ ముఖ్యమైన ఘట్టం జ్వాలా తోరణం

 

పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీరారమలిగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి జ్వాలా తోరణ కార్యక్రమం శాస్త్రోత్రంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అన్ని శైవ క్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి రోజున జరుపుకుంటూరు. అయినా పంచారామ క్షేత్రాల్లో మాత్రం కృత్తిక నక్షత్రం రోజున జరుపుతారు. భక్తులు, ఆలయ ధర్మ కర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాస్, ధర్మ కర్తలు పినిశెట్టి శ్రీనివాస్, బసవ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది భక్తులకు జాగ్రత్తలు సూచించారు. జ్వాలా తోరణ నుంచి వరి గడ్డి పరకల కోసం ఎగబడ్డారు.