Skip to main content

Telugu News Power

అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం స్మార్ట్ ఫోన్ – మంత్రి నిమ్మల

అంగన్వాడీలకు 5జి స్మార్ట్ ఫోన్ అందజేస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు:డిసెంబర్,14 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కోసం స్మార్ట్ ఫోన్లు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ పంపిణీ చేస్తుందని మంత్రి నిమ్మల వెల్లడించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మంత్రి సోమవారం 224 మంది అంగన్వాడీలకు 5జి స్మార్ట్ ఫోన్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు 5జి ఫోన్ పరిష్కారం చూపుతుందన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి తను ఏ అవకాశం వచ్చిన తప్పక ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రిని అంగన్వాడీలు సత్కరించారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు, బిజెపి నాయకులు కపర్తి కపర్థి, జనసేన నాయకులు చిన్న, తులా రామలింగేశ్వర రావు తెలుగుదేశం నాయకులు గండేటి వెంకటేశ్వరరావు, పాముల రజిని కుమార్, ధనాని సూర్యప్రకాష్, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, అధికారులు అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.