Telugu News Power

రాష్ట్రంలో దుర్మార్గపాలన- -వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ గుడాల గోపి

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఇంచార్జ్ గుడాల గోపి
స్థానిక పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ వినతి పత్రం అందజేస్తున్న వైసిపి నాయకులు

పాలకొల్లు: ఫిబ్రవరి,3 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తుందని వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల హరిగోపాల్రావు, మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం బయటకు తీసుకు వచ్చారన్నారు. వారు ఇచ్చిన, హామీలు నిలబెట్టుకోలేక, సూపర్ సిక్స్ పథకాన్నించి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారన్నారు. డైవర్షన్ పాలిటిక్స్, చంద్రబాబునాయుడు నైజం అన్నారు. తల్లికి వందనం 84 లక్షల మందికి వర్తింపజేయాలని, ఆ మేరకు ఇచ్చారా అని ప్రశ్నించారు. స్థానిక 100 పడకల ఆసుపత్రి ఎప్పుడో నిర్మాణం పూర్తయినప్పటికీ, ప్రారంభించకుండా ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని నిలదీశారు. తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారంవలో సిబిఐ నివేదికలు కల్తీ జరగలేదని తేల్చిందన్నారు. రాష్ట్రంలో ఆరాచక పాలన నడుస్తుందన్నారు. రాష్ట్రాన్ని పాకిస్తాన్ లా తయారు చేస్తున్నారన్నారు. కాపు నాయకుడు అంబటి రాంబాబు పై దాడిని ఖండిస్తూ, కాపులు వైఎస్ఆర్ పార్టీలో ఉండకూడదా అని ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాలకు చెందిన జోగి రమేష్ ఇంటిపై దాడిని గర్హించారు. రాష్ట్రాన్ని ఎటు తీసుకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో రాష్ట్రానికి ఎమర్జెన్సీ పాలన తీసుకువస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, నడపన గోవిందరాజుల నాయుడు, యడ్ల తాతాజీ, చెల్లెం ఆనంద్ ప్రకాష్, కోరాడ శ్రీనివాస్, కర్ర జయ సరిత, జోగాడా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్ పై జరుగుతున్న దాడులు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ రజనీ కుమార్ వినతిపత్రం అందజేశారు.