Skip to main content

Telugu News Power

బాల టెన్నిస్ క్రీడాకారునికి, గాంధీ భగవాన్ రాజు అభినందన.

బాల టెన్నిస్ క్రీడాకారునికి భగవాన్ రాజు అభినందనలు.

పాలకొల్లు: ఫిబ్రవరి, 4(తెలుగు న్యూస్ పవర్) బాల టెన్నిస్ యోధుడు దార్షిక్ ను, స్థానిక కాష్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు బుధవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో, సభ్యులతో కలిసి అభినందనలు తెలియజేశారు. దార్షిక్ 2025 టెన్నిస్ బెస్ట్ ప్లేయర్ కప్ సాధించారు. సౌత్ ఇండియన్, టెన్నిస్ టోర్నమెంట్లో ఈ బాలుడు రన్నర్ గా వచ్చాడు. ఈ పోటీలు విజయవాడలో ఆదివారం జరిగాయి. బాలుర 9 ఏళ్లలోపు విభాగంలో ఈ అవార్డు దక్కించుకున్నారు. క్యాలెండర్ ఇయర్ 2025, అత్యధిక పాయింట్లు, అతి చిన్న వయసులో తన ఖాతాలో వేసుకున్న ఘనుడు దార్షిక్. ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారునిగా భవిష్యత్తులో భారతదేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఈ సందర్భంగా,పలువురు ఆకాంక్షించారు.