భీమవరం: ఫిబ్రవరి, 8(తెలుగు న్యూస్ పవర్) శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి, నిలువెత్తు సంపూర్ణ, స్వర్ణమయ, స్వర్ణ నిధి పథకానికి, స్థానిక భక్త దంపతులు, గోంట్ల వెంకట రామారావు, వెంకట లక్ష్మి సత్యవతి ఆదివారం బంగారం కానుకగా సమర్పించుకున్నారు. లక్ష 17 వేల రూపాయల విలువైన, 8 గ్రాముల బంగారాన్ని అమ్మవారికి, ఆలయ అధికారుల ద్వారా సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, ఈ పుణ్య దంపతులకు, వేద ఆశీర్వచన పూజలు చేసి, ఆశీస్సులు అందించారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్, ఆలయ ఈఓ బుద్ధ మహాలక్ష్మి ప్రసాద్ అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. ధర్మకర్తలు, రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు హాజరయ్యారు.
మావుళ్ళమ్మకు కనకపు కానుక
మావుళ్ళమ్మకు బంగారం సమర్పిస్తున్న భక్తులు