Skip to main content

Telugu News Power

గీత కార్మికుని కుటుంబానికి మంత్రి 2.50 లక్షల సాయం.

పాల శ్రీదేవి కి ఆర్థిక సహాయం అందిస్తున్న మంత్రి నిర్మల

పాలకొల్లు: ఫిబ్రవరి,10(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు తన క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం గీత కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. స్థానిక పాలమూరుకు చెందిన గీత కార్మికుడు, ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మరణించిన సందర్భంగా, వారి భార్య శ్రీదేవికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేసిన 2లక్షల రూపాయలతో పాటు, మంత్రి వ్యక్తిగతంగా 50 వేల రూపాయలు అందజేశారు. ఈ రెండున్నర లక్షల రూపాయలతో, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా మంత్రి సూచించారు. పలువురు పాలమూరు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.