Telugu News Power

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశ పూజలు నేటి నుంచే.

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారు

యలమంచిలి: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశానికి, నేటి నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మూలస్థానేశ్వరి అమ్మవారి బింబ యంత్ర ప్రతిష్టాపన మహోత్సవాలో భాగంగా మొదటి రోజు, ఉదయం గణపతి ప్రార్ధన మంగళ వాయిద్యములతో ఆలయ ప్రదక్షిణ, భూతబలి, విగ్నేశ్వర పూజతో మొదలై సాయంత్రం వరకు బ్రహ్మశ్రీ కాళ్లకూరి దుర్గాప్రసాద్ శర్మ, బ్రహ్మశ్రీ యలమంచిలి నరేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఈ పూజలు రాత్రి వరకు కొనసాగుతాయి. అమ్మవారి ఆలయ తలుపులకు మంగళవారం పూజలు చేసి, దేవాలయానికి తీసుకు వెళ్లారు. మహిళలు అమ్మవారికి పూలమాలలు తయారు చేశారు. విద్యుత్ దీపకాంతులు చూపురులను ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారి ఆలయం యాగశాల, అమ్మవారి కాషాయ పతాకాల అలంకరణతో ఆధ్యాత్మిక అనుభూతికి ప్రేరణ కలిగిస్తున్నాయి. ఒకవైపు అమ్మవారికి సమర్పించిన ఆవు దూడ చూడముచ్చటగా భక్తులను తమ వైపు తిప్పుకుంటున్నాయి. అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనటానికి ఇప్పటికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు యలమంచిలి చేరుకున్నారు. ఎందరోభక్తులు భూరివిరాళాలు అమ్మవారికి ఇస్తూనే ఉన్నారు. తాళ్లూరి సుబ్బారావు (లండన్ రాజు) సరోజని దంపతుల కుమారులు, తాళ్లూరు వెంకటేశ్వర రావు, సుధీర్ ల కుటుంబ సభ్యులు 4 లక్షల రూపాయలతో గుడికి గ్రానైట్ వేయిస్తున్నారు. మన్నె నరసింహమూర్తి గారి కుమారులు, సత్యనారాయణ, శ్రీనివాసరావు, సూర్య భాస్కరరావు అమ్మవారికి లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు. సిద్ధాని రాము (స్టీల్ కొట్టు రాము) రేణుకా దేవి దంపతులు లక్ష రూపాయల విరాళం అందజేశారు. కాసా సత్య దంపతులు, లక్ష విరాళం ప్రకటించారు.తమ్మినేడి రాధాకృష్ణ గారి కుమారుడు, సత్యనారాయణమూర్తి 50 వేల రూపాయలు అమ్మవారికి కానుకగా సమర్పించుకున్నారు. ఇంకా ఎందరో భక్తులు తమ శక్తి మేరకు విరాళాలు ఇవ్వటానికి, త్వరపడుతున్నారు. అమ్మవారి మహిమతో యలమంచిలి, ఆధ్యాత్మిక భక్తి భావంతో మూడు రోజులపాటు తన్మయత్వంతో అమ్మవారి సేవలో తరించనుంది. అమ్మవారి అనుగ్రహంతో పలువురు భక్తులు, ఈ పవిత్ర కార్యానికి తమ శక్తి మేరకు వివిధ కార్యక్రమాల్లో, తమను నియమించిన,కర్తవ్య నిర్వహణలో నిమగ్నమై పనిచేస్తున్నారు. తాళ్లూరి శ్రీనివాస్ ఈ మహత్తర కార్యక్రమాన్ని, ముందుండి నడిపిస్తున్నారు. వేల మంది ఈ పూజా కార్యక్రమాల్లో, మూడు రోజులపాటు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు కూడా చేశారు.

అమ్మవారికి పూలమాలల పనిలో భక్తులు
అమ్మవారి గుడి తలుపులకు పూజలు
అమ్మవారికి నాలుగు లక్షల అందజేసిన తాళ్లూరి రాజు కుటుంబ సభ్యులు
విద్యుత్ కాంతుల రూపంలో అమ్మవారు