Telugu News Power

శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ వారికి భారీగా హుండి ఆదాయం.

శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి హుండీ లెక్కిస్తున్న దృశ్యం

భీమవరం: ఫిబ్రవరి,26(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు
ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం, అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో హుండీలు తెరచి గురువారం లెక్కించారు. ఇప్పటివరకు గడిచిన 28 రోజుల కాలానికి హుండీల ద్వారా రూ.51,52,032. లు (అక్షరాలా యాభై ఒక్క లక్ష యాభై రెండువేల ముప్పై రెండు రూపాయలు) భక్తులు నగదు రూపంలో కానుకలుగా సమర్పించారు. బంగారం 33 గ్రాములు 240 మిల్లీగ్రాములు, వెండీ 189 గ్రాములు మరియు పలు దేశముల విదేశీ కరెన్సి శ్రీ అమ్మవారికి హుండీల ద్వారా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కృష్ణా జిల్లా సింగరాయపాలెం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ జి గంగా శ్రీదేవి పర్యవేక్షణలో జరిపిన ఈ లెక్కింపులో ఆలయప్రధానార్చకులు
బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ,, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం మరియు ధర్మకర్తలు, యు.మీనాక్షి, శిరీష,పాపోలు ఏడుకొండలు,కారెంపూడి ఆదిలక్ష్మి,జి రమణ,వై సత్యవతి,బన్ను ప్రసాద్ ,భీమవరం దేవదాయ ధర్మదాయశాఖ తనిఖీదారు వి వెంకటేశ్వరరావు, మత్యపురి గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి రఘునాథ్, ఉండి గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి శరణ్య మరియు యూనియన్ బ్యాంకు సిబ్బంది
, పోలీస్ సిబ్బంది
ఆలయ సిబ్బంది పాల్గొన్నారని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణదికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు.