Telugu News Power

అంగరంగ వైభవంగా మూలస్థానేశ్వరి అమ్మవారి జాతర మహోత్సవం.

వివిధ ఫలా, పుష్పాలతో అలంకరించిన అమ్మవారి ఆలయం నుంచి అనుగ్రహ దర్శనం ఇస్తున్న మూలస్థానేశ్వరి అమ్మవారి అనుగ్రహ దర్శనం.

యలమంచిలి: ఫిబ్రవరి,26(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి జాతర ఉత్సవం అత్యంత అంగరంగ వైభవంగా గురువారం రాత్రి జరిగింది. దాదాపు పది రకాల వివిధ ఈవెంట్లతో జాతర భారీగా సాగింది. గ్రామంలో ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ఈవెంట్లతో జాతర జరగలేదు. అమ్మవారిని అలంకరించిన హంస వాహనంపై జాతర గ్రామోత్సవంలో భక్తులకు అనుగ్రహ దర్శనం ఇచ్చారు. అమ్మవారి ఆలయం ముందు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కనకదుర్గమ్మ అమ్మవారు కనపడి,ఈ జాతర అమ్మవారికి సంబంధించిన అన్ని అన్ని కార్యక్రమాలు విరమించకుండా కొనసాగించాలని కనకదుర్గమ్మ అమ్మవారి రూపంలో వెల్లడించారు. అమ్మవారి ఆలయంలో ఉన్న ఘటాలు శిరస్సుపై ధరించి, గణాసారుల నృత్యాలతో ఈ జాతర ప్రారంభమైంది. బేతాళ నృత్యం, కేరళ సాంప్రదాయ చంద డప్పు వాయిద్యాలతో కూడిన నృత్యం ఆకట్టుకుంది. కాళ్లకు ఇనుప మువ్వలతో ఉన్న కంకణాలు ధరించి చేసే మాయవృత్యం
హుశారుగా సాగింది. డీజే డాన్సులు, స్థానిక యువకులు పక్కా లోకల్ డాన్స్ వీక్షకులను ఆకర్షించింది. ఇంతకుముందే న్నడు చూడని, వివిధ అంశాలు పై భక్తులు వర్షం వ్యక్తం చేశారు. ఈ జాతర కార్యక్రమాన్ని నిర్వాహకులు తాళ్లూరి శ్రీనివాస్ వైజాగ్ బుజ్జి, ఆధ్వర్యంలో జరిగింది. ఈ జాతర నిర్వహణకు బొప్పన రాంబాబు,బొప్పన శివ మేకా శేషు, చిలుకూరు సాయి, ఆకుల యేసు, సిద్దాని రాము చిలుకూరి ఆంజనేయులు, కత్తర్ శీను, కూర్మా రావు, గణపతి,యువకులు దగ్గరుండి నడిపించారు. స్థానిక పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమా న్ని వీక్షించి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఘనసారుల నృత్యం
బేతాళ నృత్య విన్యాసాలు
పూణే బ్యాండ్
కేరళ చద్దా డప్పు వాయిద్యాలు
జాతర ఉత్సవాలు పర్యవేక్షిస్తున్న వైజాగ్ బుజ్జి